
YS Jagan: నేడు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
YS Jagan: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి.. శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
YS Jagan: విజయనగరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. శంకుస్థాపన అనంతరం GMR సంస్థ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. అందుకు సంబంధించిన ల్యాండ్ ను ఇప్పటికే అధికారులు GMR సంస్థకు అప్పగించారు .అయితే భోగాపురం ఎయిర్ పోర్ట్ కు 2015 లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటికీ తొమ్మిదేళ్లుగా అడ్డంకులు ఎదురవడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కొత్త దిశను నిర్దేశించనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాల కల్పనతో పాటు.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక రంగాల వృద్ధికి ఊతమిస్తుంది.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం...ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధికి దోహదం చేయనుంది. 2 వేల 203 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం తొలిదశ పనులను 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. పనులు ప్రారంభించిన నాటి నుంచి గరిష్టంగా మూడేళ్ల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తిచేసి ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను నిర్వహించనున్నారు. అయితే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది. తొలిదశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణాలు సాగించేలా రూపొందించి.. ఆ తర్వాత ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఏటా 4 కోట్ల మంది ప్రయాణించే వీలుగా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయనున్నారు.
తారకరామ తీర్ధసాగర్ జలాశయ ప్రాజెక్టు పెండింగ్ పనులకు, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. వీటికి సంభందించి భోగాపురం సమీపంలోని సవరవల్లివద్ద శిలా ఫలకాల ఆవిష్కరణ అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సిఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని GMR గ్రూప్ 2,203 ఎకరాల్లో నిర్మించనుంది. ఇందులో రూ.4,592 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్టు తొలిదశ నిర్మాణాన్ని ఆ సంస్థ చేపట్టనుంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి గరిష్టంగా మూడేళ్ల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తిచేసి ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం లో GMR .విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది. తొలిదశలో ఏటా 60 లక్షల మంది(ఆరు మిలియన్ల) ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణాలు సాగించేలా డిజైన్ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు సవరివిల్లి వద్ద ఏర్పాటు చేసిన జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు చేరుకొని, ఆ సెంటర్‌ను సందర్శిస్తారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను అక్కడే ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సమీపంలోని బహిరంగసభ వేదిక వద్దకు చేరుకొని ప్రసంగిస్తారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




