YS Jagan: ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటన

YS Jagan: బీచ్ రోడ్‌లో సీ హరీయర్ మ్యూజియం ప్రారంభోత్సవం

Dhatripriya
Updated on: 11 May 2023 9:15 AM IST
CM Jagan Visit To Visakhapatnam Today
X

YS Jagan: ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటన

YS Jagan: సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని... ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3 గంటల 50 నిమిషాలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవకు చేరుకుని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించి ప్రసంగిస్తారు. అనంతరం 5.50 గంటలకు బీచ్‌ రోడ్డుకు చేరుకుంటారు.

అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్‌ యుద్ధ విమాన మ్యూజియాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాలను కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. 6.15 గంటలకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుని ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Dhatripriya

Dhatripriya

Next Story