Jagan: ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ టూర్

Jagan: జగన్నాథగట్టు, బనగానపల్లెలో పర్యటించనున్న జగన్‌

Jyothi
Published on: 14 March 2024 7:52 AM IST
CM Jagan visit to the joint Kurnool District Today
X

Jagan: ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Jagan: ఏపీ సీఎం జగన్‌ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్‌ లా యూనివర్సిటీ. అనంతరం బనగానపల్లేలో 22కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రిని ఆయన ప్రారంభిస్తారు. అలాగే.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. బనగానపల్లే హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగే వైసీపీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ పర్యటనలోనే స్థానిక ప్రజాప్రతినిధులతోనూ సీఎం కాసేపు చర్చించనున్నారని సమాచారం.

Jyothi

Jyothi

Next Story