నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
Jagan: రెండు సొరంగాలను ప్రారంభించనున్న సీఎం జగన్
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
Jagan: సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నరగ గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story




