నేడు కాకినాడలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న జగన్‌

Jyothi
Updated on: 3 Jan 2024 12:40 PM IST
CM Jagan visit to Kakinada Today
X

నేడు కాకినాడలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఇవాళ కాకినాడలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న జగన్.. కొండయ్యపాలెం ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. కాకినాడలో సైన్స్ సెంటర్, స్కేటింగ్ రింగ్, కళాక్షేత్రం ప్రారంభం అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. పెన్షన్లను క్రమంగా 3వేల వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తుంది వైఎస్సార్ పెన్షన్ కానుక.

ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.

Jyothi

Jyothi

Next Story