Jagan: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన.. ప్రధాని మోడీతో భేటీ.. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చ
Jagan: ఇవాళ జగన్ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.
Jagan: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన.. ప్రధాని మోడీతో భేటీ.. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చ
Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ జగన్ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ప్రధానికి వివరించనున్న సీఎం జగన్.. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దలకు వివరించనున్నారని తెలుస్తోంది.
Next Story


