సీఎం జగన్ పర్యటనలో మార్పు.. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు జగన్..

X
Highlights
ఏపీ సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తిరుపతి నుంచి సీఎం నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు. రేణిగుంట...
Arun Chilukuri24 Sep 2020 5:54 AM GMT
ఏపీ సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తిరుపతి నుంచి సీఎం నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోన్నారు. ఉదయం 11:20 గంటలకు నగరంలోని కంటినెంటల్ ఆసుపత్రికి వెళ్తారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న వైఎస్ భారతి తండ్రిని సీఎం జగన్ పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం సీఎం తిరుమల నుంచి నేరుగా తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. గంగిరెడ్డి అనారోగ్యం గురించి సమాచారం అందడంతో సీఎం తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నారు.
Web Titlecm Jagan tour schedule changed
Next Story