CM Jagan: విమర్శల డోస్ పెంచిన సీఎం జగన్.. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌, బాలకృష్ణలకు స్ట్రాంగ్ కౌంటర్

CM Jagan: ఒకడిదేమో బాబుతో పొత్తు, బీజేపీతో కాపురం

Jyothi
Published on: 21 July 2023 12:43 PM IST
CM Jagan Strong Counter To Pawan Kalyan Over Volunteer Comments And Chandrababu
X

CM Jagan: విమర్శల డోస్ పెంచిన సీఎం జగన్.. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌, బాలకృష్ణలకు స్ట్రాంగ్ కౌంటర్

CM Jagan: సీఎం జగన్... విమర్శలకు పదునెక్కించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈసారి లోకేష్, బాలకృష్ణపై కూడా హాట్ కామెంట్స్ చేశారు సీఎం జగన్. నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్‌కల్యాణ్‌.. వాలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నిర్మాత చంద్రబాబు, నటన, మాటలు అన్నీ దత్తపుత్రుడివేనని.. పదేళ్లుగా చంద్రబాబుకు ప్యాకేజీస్టారే వాలంటీర్‌ ఫైరయ్యారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌, బాలకృష్ణలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకరేమో యూట్యూబ్‌లో అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తాడు..? ఇంకొకరేమో అమ్మాయిలు కనిపిస్తే చాలు.. ముద్దుపెట్టాలి, కడుపుచేయాలి అంటాడని ఆరోపించారు. మన వాలంటీర్లు ఎక్కడైనా అమ్మాయిలను లోబర్చుకున్నారా అని ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story