2022 ఖరీఫ్‌కు పోలవరం నీళ్లిస్తాం : సీఎం జగన్

2022 ఖరీఫ్‌కు పోలవరం నీళ్లిస్తాం : సీఎం జగన్
x
Highlights

పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా ఉంటుందన్న జగన్, 2022 ఖరీఫ్‌కు పోలవరం...

పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా ఉంటుందన్న జగన్, 2022 ఖరీఫ్‌కు పోలవరం నీళ్లిస్తామంటూ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. 44 మీటర్ల ఎత్తు వరకు నీరు నిల్వ చేయొచ్చని, 194 టీఎంసీల నీటి నిల్వకు మరింత ఖర్చవుతుందని వివరించారు. అయితే పోలవరం పూర్తి చేసేందుకు ఇంకా 37 వేల 885 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు.

రివర్స్ టెండరింగ్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 సమయంలో పోలవరం విషయంలో టీడీపీ అవినీతికి పాల్పడిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ ద్వారా 1343 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు సీఎం వివరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories