Jagan: ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన.. ఇక్కడే సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తా

Jagan: అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది

Shekhar G
Published on: 5 March 2024 12:39 PM IST
CM Jagan Key Announcement On AP Capital
X

Jagan: ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన.. ఇక్కడే సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తా

Jagan: ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖనే కొనసాగుతుందని... ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తానన్నారు జగన్. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటానని.. విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందన్నారు జగన్. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తామన్నారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక.. వ్యక్తిగత స్వార్థమేమి లేదని స్పష్టం చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని.. ఇకపై అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించారు.

Shekhar G

Shekhar G

Next Story