CM Jagan: ఎందుకు ఈ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి..?

CM Jagan Hot Comments in Tiruvuru Meeting Jagananna Vidya Deevena
x

CM Jagan: ఎందుకు ఈ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి..?

Highlights

CM Jagan: మన ప్రభుత్వంలో డీబీటీ.. వారిది డీపీటీ

CM Jagan: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామన్నారు. అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని... పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్‌.. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 698.68 కోట్లు రూపాయలు జమ చేశారు.

వైసీపీది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని విమర్శించారు. తమ ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్‌ బెన్‌ఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌.. గత ప్రభుత్వంలో డీబీటీ.. దోచుకో పంచుకో తినుకో అంటూ సీఎం దుయ్యబట్టారు. సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్‌లు కాదని.. చివరికి మంచి చేసిన వారే గెలుస్తారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories