CM Jagan: ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం జగన్‌ ఫోకస్‌

CM Jagan: తుది దశకు చేరుకున్న మేనిఫెస్టో కసరత్తు

Jyothi
Published on: 4 March 2024 10:50 AM IST
CM Jagan Focus on Election Manifesto
X

CM Jagan: ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం జగన్‌ ఫోకస్‌

CM Jagan: ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్దుల ఖరారు పై ఒక అంచనాకు వచ్చాయి. ఇక..ఎన్నికల మేనిఫెస్టోల పైన పార్టీలు ఫోకస్ చేసాయి. సీఎం జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. ఇక, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో మేని ఫెస్టో ప్రకటను జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 11న సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టో‌పై చర్చించనున్నారు. సిద్ధం సభలో మేనిఫెస్టో‌పై ప్రకటన చేసే అవకాశం ఉండటంతో..మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది.

2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మరి కొన్ని చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా రైతు రుణ మాఫీ పైన ప్రకటన ఉంటుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సిద్ధం సభలో సీఎం జగన్ ఎలాంటి ఎన్నికల వరాలు ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Jyothi

Jyothi

Next Story