CM Jagan Express Deep Condolences: సాంబశివరాజు మృతికి సీఎం జగన్‌ సంతాపం

CM Jagan express deep condolences to Samba Siva Raju: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల సీఎం జగన్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు

Arun Chilukuri
Published on: 10 Aug 2020 10:42 AM IST
CM Jagan Express Deep Condolences: సాంబశివరాజు మృతికి సీఎం జగన్‌ సంతాపం
X

CM Jagan express deep condolences to Samba Siva Raju: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల సీఎం జగన్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెనుమత్స సాంబశివరాజు అని జగన్‌ అన్నారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విశాఖలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఆయన ఎపిలో అత్యధికసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఎనిమిది పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన ఆయన, 1968లో తొలిసారి శాసనసభ కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఒక్కసారి మినహా పోటీచేసిన అన్నిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణంపై వైసీపీ నేతలు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story