Samba Sivaraju Passed Away: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత

Arun Chilukuri
Updated on: 10 Aug 2020 12:23 PM IST
Samba Sivaraju Passed Away: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత
X

samba sivaraju passed away: మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విశాఖలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఆయన ఎపిలో అత్యధికసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఎనిమిది పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన ఆయన, 1968లో తొలిసారి శాసనసభ కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఒక్కసారి మినహా పోటీచేసిన అన్నిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.1994లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అందులోనే కొనసాగారు. ఆయన మరణంపై వైసీపీ నేతలు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story