CM Jagan: గతంలో మొక్కుబడిగా పథకాల అమలు

CM Jagan: వధువుల తల్లుల ఖాతాలో నిధులు జమ

Shekhar G
Published on: 23 Nov 2023 7:49 PM IST
CM Jagan Disburses Funds Under YSR Kalyanamasthu And YSR Shaadi Tohfa
X

CM Jagan: గతంలో మొక్కుబడిగా పథకాల అమలు

CM Jagan: ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల అయ్యాయి. క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ నిధుల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు 81లక్షల 64 వేల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని తెలిపారు.

ఈ పథకంలో ఇప్పటివరకు మూడు త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించామని చెప్పారు. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇవాళ్టికి ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి 46,062 జంటలకు 349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story