మంత్రి నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

X
Highlights
ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తల్లి నాగేశ్వరమ్మ ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Krishna21 Nov 2020 11:12 AM GMT
ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తల్లి నాగేశ్వరమ్మ ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం నాని ఇంటికి వెళ్లిన జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ తో పాటుగా పలువురు మంత్రులు కూడా ఉన్నారు.
Web TitleCM jagan consolation to Minister perni nani Family
Next Story