కరోనాపై ఏపీ సర్కార్ అప్రమత్తం.. రేపటి నుంచి హైఅలర్ట్ ప్రకటించే దిశగా..

Arun Chilukuri
Updated on: 19 March 2020 4:36 PM IST
కరోనాపై ఏపీ సర్కార్ అప్రమత్తం.. రేపటి నుంచి హైఅలర్ట్ ప్రకటించే దిశగా..
X

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా నియంత్రణ చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం అయిన సీఎం జగన్ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

మరోవైపు అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన చర్యలపై సీఎస్ నీలం సహాని వివరించారు. ఏపీలో రేపటి నుంచి హైఅలర్ట్ ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story