CM Jagan: చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసం..దగా

CM Jagan: వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే

Shekhar G
Published on: 7 March 2024 1:44 PM IST
CM Jagan Comments On Jagan
X

CM Jagan: చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసం..దగా

CM Jagan: చంద్రబాబుపై సీఎం జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే నయవంచన గుర్తుకు వస్తుందని విమర్శించారు. పొదుపు రుణాలను మాఫీ చేస్తామని మోసం చేశాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం అమ్మవారి పేరు కూడా వాడుకున్నాడని అన్నారు. ఇప్పుడు మహాశక్తి పేరిట మరోసం మోసానికి తెరలేపాడని అన్నారు. వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమేనని అన్నారు. అనకాపల్లి జిల్లాలో వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 26 లక్షల 98 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ 5వేల 60 కోట్లను జమ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story