Jagan: గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. నెల రోజులైనా రాష్ట్రంలో కనిపించారా..?

Jagan: ఇప్పుడు మాత్రం రాజమండ్రిలో కనిపిస్తున్నారు

Shekhar G
Published on: 12 Oct 2023 1:46 PM IST
CM Jagan Comments On Chandrababu Naidu
X

Jagan: గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. నెల రోజులైనా రాష్ట్రంలో కనిపించారా..?

Jagan: గత ప్రభుత్వంలో చంద్రబాబు ఒక సెంట్‌ భూమి కూడా పేద ప్రజలకు ఇచ్చింది లేదని గుర్తుచేశారు సీఎం జగన్. తాను 30 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉండి కూడా.. ఒక సెంట్‌ భూమి పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో కానీ, కుప్పంలో కానీ ఒక ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదన్నారు. పక్క రాష్ట్రంలోని హైదరాబాద్‌లో చంద్రబాబు ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో కుప్పంలో 20వేల‎ ఇళ్లు నిర్మించి ఇచ్చామని సీఎం జగన్‌ అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నెల రోజులైనా రాష్ట్రంలో కనిపించారా అని ప్రశ్నించిన జగన్.. ఇప్పుడు మాత్రం రాజమండ్రిలో కనిపిస్తున్నారని చురకలు అంటించారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అనంతరం.. వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Shekhar G

Shekhar G

Next Story