సీఎం జగన్‌కు మరో కీలక పదవి

Arun Chilukuri
Published on: 29 Aug 2020 10:35 AM IST
సీఎం జగన్‌కు మరో కీలక పదవి
X

Jagan: ఏపీ సీఎం జగన్ మరో కీలక పదవిని చేపడుతున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్మెంట్‌ కోసం జ‌గ‌న్ స‌ర్కార్ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుబంధంగా ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీని కూడా నియమిస్తూ నోటిఫికేషన్ వెలువ‌రించారు.

ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం జగన్ నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన 11 మంది ముఖ్యకార్యదర్శులను, ఉన్నతాధికారులను సభ్యులుగా పేర్కొంటూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే పలు శాఖలు సీఎం చేతిలో ఉన్న విషయం విదితమే. తాజాగా జగన్‌కు మరో పదవి వచ్చింది.




Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story