Chandrababu: తొలిసారి రుషికొండకు సీఎం చంద్రబాబు.. ఎలాంటి ప్రకటన ఉంటుందో అని..

Chandrababu: నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Nov 2024 9:01 AM IST
CM Chandrababu to Visit Rushikonda
X

Chandrababu: తొలిసారి రుషికొండకు సీఎం చంద్రబాబు.. ఎలాంటి ప్రకటన ఉంటుందో అని..

Chandrababu: నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో ఆ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న సీఎం విశాఖకు వెళ్లనున్నారు. రోడ్లు పూడ్చే కార్యక్రమాన్ని వెన్నెలపాలెంలో ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమం తర్వాత రుషికొండ బీచ్‌ వద్ద ఉన్న నిర్మాణాలను సందర్శించనున్నారు.

సీఎం అయ్యాక తొలిసారి రుషికొండకు చంద్రబాబు వెళ్తుండటంతో ఎలాంటి ప్రకటన ఉంటుందో అని ఆసక్తి నెలకొంది. ఆతర్వాత విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పెట్టుబడులపై కీలక ప్రకటన చేయనున్నారు చంద్రబాబు. సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన అనంతరం కీలక ప్రకటన వెలువడనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story