Nakkapalle: హెటిరో ప్రమాదంలో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి : సీఐటీయూ

S. Srikanth
Published on: 7 April 2020 6:56 PM IST
Nakkapalle: హెటిరో ప్రమాదంలో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి : సీఐటీయూ
X

నక్కపల్లి: హెటిరో డ్రగ్స్ కంపెనీలో మంగళవారం జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. జూనియర్ కెమిస్ట్ గా విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురైన గాడి శ్రీను కుటుంబానికి కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లో భాగంగా ప్రమాదం జరిగి మృత్యువాత పడడం దురదృష్టకరమని అన్నారు. ఎన్ఏ ఎఫ్డీ డ్రయిర్ క్లీన్ చేస్తుండగా కెమికల్ ప్రభావానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడన్నారు.

అది గమనించి రక్షించే ప్రయత్నం చేసిన షిఫ్ట్ ఇంచార్జి అప్పారావు కూడా అపస్మారక స్థితికి చేరుకున్నాడని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలననే తరుచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అప్పలరాజు ఆరోపించారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీలలో రక్షణ, భద్రతలపై ఇనస్పెక్టర్ ఆఫ్ కంపెనీస్ నిరంతర పర్యవేక్షణ చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే అస్వస్ఠతకి గురైన అప్పారావుకి హెటిరో యాజమాన్యం మెరుగైన వైద్యం అందించాలని అప్పలరాజు కోరారు.


S. Srikanth

S. Srikanth

Next Story