గుర్రాజుపేటలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

గుర్రాజుపేటలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
x
రాజా రమేష్
Highlights

మండలంలో గుర్రాజుపేట గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి.

ఎస్.రాయవరం: మండలంలో గుర్రాజుపేట గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. సుమారు 15 గ్రామాలకు చెందిన క్రైస్తవులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిటీ జిల్లా అధ్యక్షుడు కొర్ని రాజా రమేష్ 22 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇటువంటి క్రిస్మస్ వేడుకలు జరపడం ఇదే మొదటిసారి అని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories