Chirala MLA Karanam Balaram: చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా పాజిటివ్

Chirala MLA Karanam Balaram: కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ఏపీలో క‌ల్లోలం సృష్టిస్తుంది. కరోనా ఉధృతి శరవేగంగా ఉంది. ఈ వైరస్‌కు చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు.

Arun Chilukuri
Published on: 4 Aug 2020 12:14 PM IST
Chirala MLA Karanam Balaram: చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా పాజిటివ్
X

Chirala MLA Karanam Balaram: కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ఏపీలో క‌ల్లోలం సృష్టిస్తుంది. కరోనా ఉధృతి శరవేగంగా ఉంది. ఈ వైరస్‌కు చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు. కరోనా ముప్పు పోలీసులు, వైద్య సిబ్బందితో పాటూ ప్రజా ప్రతినిధుల్ని వెంటాడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా మరో ఏపీ ఎమ్మెల్యేకు కోవిడ్‌ నిర్థారణ అయింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా సోకింది. దీంతో ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే కరణం కుటుంబ సభ్యులతో పాటు, ఆయనతో కాంటాక్ట్‌ అయిన అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు.

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,66,586 కి చేరుకుంది. మరణాల సంఖ్య 1537 కి చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 76,337 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు కరోనాతో పోరాడి 88,672 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story