Ayyanna Patrudu: మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న

Ayyanna Patrudu: మున్సిపల్‌ అధికారులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి రెచ్చిపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Jun 2024 9:23 AM IST
Chintakayala Ayyanna Patrudu Angry On R & B Officers
X

Ayyanna Patrudu: మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న

Ayyanna Patrudu: మున్సిపల్‌ అధికారులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. నర్సీపట్నంలో రోడ్ల నాణ్యతపై అయ్యన్నపాపత్రుడు ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడుతూ బూతులతో రెచ్చిపోయారు. వినలేని రాయలేని భాషలో ఆయన అధికారుల మీద బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. రోడ్ల నాణ్యత బాగు లేదు అన్నది ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆవేదన అర్ధం చేసుకోవాల్సిందే. అధికారులకు క్లాస్ తీసుకోవాల్సిందే. కానీ ఈ క్రమంలో అదుపు తప్పి బూతులు మాట్లాడటం అది కూడా రోడ్డు మీదనే అలా చేయడంతో అంతా షాక్ అయ్యారు.

పక్కన మహిళా సిబ్బంది ఉన్నారని కూడా చూడకుండా అయ్యన్న ఈ విధంగా భాష వాడడంతో అధికారులకు ఏడుపు ఒక్కటే తక్కువ అయింది. కొత్త శాసనసభ కొలువు తీరుతున్న వేళ స్పీకర్ గా అయ్యన్న పేరు వినిపిస్తోంది. ఆయనకే ఈ పదవి అని చంద్రబాబు ఖరారు చేశారు అని అంటున్న సందర్భంలో అయ్యన్న ఇదే తీరున వ్యవహరిస్తే ఇబ్బందే అని అంటున్నారు. స్పీకర్ అంటే రాజ్యాంగ బద్ధమైన పదవి. అయ్యన్న ఇక మీదట అయినా తన భాషను ఎలా అదుపు పొదుపుగా వాడతారో చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story