ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే
x
ఎమ్మెల్యే కోటంరెడ్డిఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Highlights

రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 26 మందికి, 30 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులకు శనివారం అందచేశారు.

నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 26 మందికి, 30 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులకు శనివారం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... 26 మందికి 30 లక్షల రూపాయల నిధులను అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల కోసం తీసుకొన్న చర్యలు ఎంతో హర్షనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, బాధితులు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories