
Chicken: తెలుగు రాష్ట్రాలతోపాటు ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఓ అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. ఆరోగ్యంగా కనిపించిన...
Chicken: తెలుగు రాష్ట్రాలతోపాటు ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఓ అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు క్షణాల్లో మరణిస్తున్నాయని రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు అకస్మాత్తుగా చనిపోతుండటంతో రైతులు రాత్రింబవళ్లు కంటిమీద కనుకు లేకుండా పోతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ ఫారాల దగ్గర చనిపోయిన కోళ్లు గుట్టలుగా ఉంటున్నాయి. ఒక్కో ఫారంలో రోజుకు దాదాపు పదివేల కోళ్ల చనిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కోళ్ల మరణానికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియక రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు.
కోళ్ల మరణంతో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా పడిపోతుండటంతో రైతుల ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. పశ్చిమగోదావరి నుంచి పశ్చిమబెంగాల్, అస్సాంలకు రోజూ 40కిపైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమతి అవుతుండగా..ఇప్పుడు ఆ సంఖ్య 25కి తగ్గింది. మరికొన్ని రోజుల్లో మరింత పడిపోతుందనే భయం రైతులను వెంటాడుతోంది.
సాధారణంగా పౌల్ట్రీ ఫారాల్లో రోజుకు 0.05 శాతం కోళ్లు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం సహజమే. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగ భిన్నంగా ఉంటుంది. ఒక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే గడిచిన 15రోజుల్లో 40 లక్షల కోళ్లు మరణించాయి. వైరస్ కారణంగా కోళ్ల మరణాలు కొనసాగితే రైతులకు తీరని నష్టం వాటిల్లుతుంది. వైరస్ ను గుర్తించి వెంటనే నిరోధక చర్యలు చేపట్టాలని రైతులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇటీవల నాటు కోళ్లలోనూ వింత లక్షణాుల కనిపించాయి. ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లలోనే వ్యాపించాయి. లేయర్ కోళ్లకు సాధారణంగా 20వారాల లోపే 23 రకాల వ్యాక్సిన్లు వేస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకి కోళ్లు చనిపోవడం పౌల్ట్రీ పరిశ్రమకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమ భవిష్యత్త ప్రశ్నార్థకమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




