Kurnool: అమ్మో చిరుత.. కర్నూలు జిల్లా రంగన్న కొండలో చిరుత సంచారం

Kurnool: ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

Shekhar G
Updated on: 4 Feb 2024 7:45 PM IST
Cheetah migration in Rangannakonda Kurnool district
X

Kurnool: అమ్మో చిరుత.. కర్నూలు జిల్లా రంగన్న కొండలో చిరుత సంచారం

Kurnool: కర్నూల్ జిల్లా కోసిగి మండలంలోని రంగన్నకొండలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. కృష్ణ అనే వ్యక్తికి చెందిన మేకల మందపై శనివారం చిరుతపులి దాడి చేసింది. మేక పిల్లను ఎత్తుకువెళ్లింది. దీంతో చిరుతను గమనించిన మేకల కాపరి తన కుక్కల సహాయంతో కేకలు వేస్తూ తరిమాడు. దీంతో మేకపిల్లను అక్కడే వదిలి చిరుతపులి పరారైంది. చిరుత పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్నామని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story