Tirupati: తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

Tirupati: తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం రేగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Aug 2024 1:41 PM IST
Cheddi Gang Entered Tirupati District
X

Tirupati: తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

Tirupati: తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం రేగింది. కొత్తపాళెం లేఅవుట్‌లోని ఓ ఇంటి ప్రహారీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని నగలు, నగదుతో పరారయ్యారు. బనియన్లు, డ్రాయర్లు ధరించి, ఒంటికి ఆయిల్‌ రాసుకొని మారణాయుధాలతో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పరారీలో ఉన్న దొంగల ముఠా కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story