Badvel: ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను వెంటనే తొలగించాలి

అట్లూరు - సిద్దవటం మార్గమధ్యంలో అటవీ అధికారులు వాహనాలు తిరగకుండా రాత్రి వేళల్లో ఏర్పాటుచేసిన చెక్ పోస్టును వెంటనే తొలగించాలని రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

S. Srikanth
Published on: 2 March 2020 3:16 PM IST
Badvel: ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను వెంటనే తొలగించాలి
X

సిద్ధవటం: అట్లూరు - సిద్దవటం మార్గమధ్యంలో అటవీ అధికారులు వాహనాలు తిరగకుండా రాత్రి వేళల్లో ఏర్పాటుచేసిన చెక్ పోస్టును వెంటనే తొలగించాలని రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా అటవీ అధికారులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ కారణంగా పరిసర ప్రాంత గ్రామ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అటవీ అధికారులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వెంటనే తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు ఎద్దుల పవన్ బాబు, బండ్ల రాజేష్, కత్తి సుబ్బ రాయుడు, సిద్ధవటం మండలం జనసేన నాయకులు రాతాల రామయ్య తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story