ఆంధ్రప్రదేశ్ లో బ్యాంకు పని వేళల్లో మార్పులు

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 31వరకు బ్యాంకు పని వేళల్లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయం తీసుకుంది.

S. Srikanth
Updated on: 25 March 2020 6:35 PM IST
ఆంధ్రప్రదేశ్ లో బ్యాంకు పని వేళల్లో మార్పులు
X

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 31వరకు బ్యాంకు పని వేళల్లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు బ్యాంకులు పని చేయనున్నట్లు తెలిపింది. కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు వంటి సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

సిబ్బంది ఆధారంగా 50 శాతం మందితో పనిచేయాలని నిర్ణయించింది. అన్ని ఏటీఎంలలో పూర్తిగా నగదు అందుబాటులో ఉంచాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది. ఏటీఎం కేంద్రాల వద్దకు గుంపులుగా వెళ్లొద్దని బ్యాంకర్ల సమితి ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.


S. Srikanth

S. Srikanth

Next Story