Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Jun 2024 3:58 PM IST
Chandrababu Visited Kanaka Durgamma Temple Vijayawada
X

Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు దంపతులకు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేశారు ఆలయ అధికారులు. అంతకుముందు చంద్రబాబు దంపతులకు పూర్ణకుంభతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story