శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన

Chandrababu: ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్న బాబు

Jyothi
Published on: 22 Dec 2022 8:56 AM IST
Chandrababu Visit to Srikakulam and Vizianagaram Districts Today
X

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన

Chandrababu: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, విజయనగరం జిల్లా రాజాం నియోజవర్గాల్లో నేడు రోడ్ షో, బహిరంగసభ నిర్వహించనున్నారు. ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న బాబు రాక కోసం ఇంచార్జిలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. బాబు పర్యటన విజయవంతానికి పోటాపోటీ స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు ఏర్పాట్లు చేశారు.

రాజాం మండలం పొగిరి జంక్షన్‌ వద్ద నేటి సాయంత్రం 4 గంటలకు వీఆర్‌ అగ్రహారం జంక్షన్‌ నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం బాబు రోడ్‌షో నిర్వహిస్తారు. పాలకొండ రోడ్‌ వద్ద నిర్వహించనున్న సభలో మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల నుంచి 9 గంటల వరకు బొబ్బిలి రోడ్‌లోని ఆర్‌సీఎం చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

Jyothi

Jyothi

Next Story