Chandrababu Naidu: నేడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు

Shekhar G
Published on: 8 Aug 2023 10:23 AM IST
Chandrababu Visit To East Godavari District Today
X

Chandrababu Naidu: నేడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu: ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కాసేపట్లో రాజమండ్రి బీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌ నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు బయల్దేరనున్నారు. ఒంటిగంటకు సీతానగరం మండలం పురుషోత్తంపట్నం ఫేజ్‌-1 ప్రాజెక్ట్ వద్దకు చేరుకోనున్నారు. రెండు గంటల వరకు పురుషోత్తపట్నం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం చేరుకోనున్నారు చంద్రబాబు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి బస్టాప్ సెంటర్‌ వరకు రోడ్‌ షోలో పాల్గొననున్నారు. అనంతరం.. కోరుకొండ బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో విజయనగరం బయల్దేరుతారు చంద్రబాబు.

Shekhar G

Shekhar G

Next Story