Chandrababu: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఈనెల 25,26 తేదీలలో కుప్పంలో బాబు పర్యటన

Jyothi
Published on: 23 March 2024 9:52 AM IST
Chandrababu Visit to Chittoor District
X

Chandrababu: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 25, 26 తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 25వ తేదీ ఉదయం పది గంటలకు పీఈఎస్ వైద్య కళాశాలకు చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం మైనార్టీ నేతలతో సమావేశం అవుతారు.

రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 26వ తేదీన ఉదయం ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తారు. పార్టీ కార్యాలయంలో తెలుగు యువతకు వన్ బూత్, టెన్ యూత్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేస్తారు. అక్కడి నుంచి రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద హంద్రీ-నివా కాలువ పనులను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ ద్వారా తిరుగు పయనమవుతారు

Jyothi

Jyothi

Next Story