100రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న ఎన్డీయే సర్కార్‌.. ఎమ్మెల్యేల పనితీరును వివరించనున్న సీఎం..

100 Days of NDA Govt: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Sept 2024 12:19 PM IST
100రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న ఎన్డీయే సర్కార్‌.. ఎమ్మెల్యేల పనితీరును వివరించనున్న సీఎం..
X

100రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న ఎన్డీయే సర్కార్‌.. ఎమ్మెల్యేల పనితీరును వివరించనున్న సీఎం..

100 Days of NDA Govt: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాలులో ఈ సమావేశం జరగనుంది. సుమారు 3 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందరోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు.. భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

అలాగే.. ఈ 100 రోజుల కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరును సీఎం చంద్రబాబు వివరించనున్నారు. కాగా, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్‌ భేటీ అనంతరం.. కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story