Chandrababu: వివేకాను చంపినంత సులభంగా నన్ను చంపడానికి కుట్రలు చేస్తున్నారు..

Chandrababu: వివేకాను చంపినంత సులభంగా నన్ను చంపడానికి కుట్రలు చేస్తున్నారు..

Arun Chilukuri
Published on: 30 Nov 2022 7:09 PM IST
Chandrababu Slams Jagan in Idhem Karma Program in Eluru
X

Chandrababu: వివేకాను చంపినంత సులభంగా నన్ను చంపడానికి కుట్రలు చేస్తున్నారు..

Chandrababu: బాబాయి వైఎస్ వివేకాను చంపినంత సులభంగా తనను చంపొచ్చని సీఎం జగన్ కుట్రలు.. అనేక కలలు కంటున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు లోకేష్‌ను టార్గెట్‌ చేసుకున్నారని కొందరు చెప్తున్నారని...కానీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. తాను తల్చుకుంటే జగన్ ఒక్క అడుగు కూడా కదల్లేడని చంద్రబాబు అన్నారు. ఏలూరులో జరిగిన ఇదేం ఖర్మరా అనే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం నిధులిచ్చే పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ ఆపేయటం సిగ్గుచేటని చంద్రబాబు అన్నారు. దెబ్బతిన్న డయాఫ్రంవాల్ ఎక్కడుందో కూడా ఎవ్వరూ చెప్పే పరిస్థితి లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్టికి కూడా..పునరావాసం కల్పించకపోవడం దారుణమన్నారు. పోలవరం ఆలస్యానికి తానే కారణమన్నట్లు జగన్ విషపు ప్రచారం చేస్తున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story