Chandrababu: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు

Chandrababu: పెట్టుబడులు రాకపోవడంతో యువత జీవితాలు నాశనమయ్యాయి

Dhatripriya
Published on: 3 May 2023 4:28 PM IST
Chandrababu Sensational Comments On Jagan Govt
X

Chandrababu: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు

Chandrababu: వైసీపీ సర్కా్ర్ పై ఫైరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ రివర్స్ పాలనతో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. యువత నిరాశకు లోనయ్యారని, పెట్టుబడులు రావడం లేదని మండిపడ్డారు. సన్ రైజ్ ఏపీ అనే పేరుతో ఏపీలో పెట్టుబడులని ఆకర్షించామని, గ్లోబల్ ఎడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశామన్నారు. పెట్టుబడుల కోసం శ్రమించామని, వివిధ రంగాల్లో ఏపీని నెంబర్-1గా నిలిపామన్నారు. పోర్టులను అనుసంధానం చేసుకుంటూ పోర్ట్ లెడ్ ఎకానమీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. జగన్ కన్నార్పకుండా అబద్దాలు చెబుతారని, భావనపాడు పోర్ట్ అంటే టీడీపీ గుర్తొస్తుందని మూలపాడు పోర్టు అని పేరు మార్చారని మండిపడ్డారు. హైదరాబాద్ కోసం రూపొందించిన విజన్ 2020 గురించి ఇప్పుడెవరైనా మాట్లాడితే వైసీపీ నేతలు చిర్రుబుర్రులాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story