Chandrababu Naidu: విజయవాడ కలెక్టరేట్‌లో గణనాథుడికి చంద్రబాబు పూజలు

Chandrababu Naidu: అధికారులతో కలిసి పూజల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Sept 2024 1:12 PM IST
Chandrababu Puja to Ganesh at Vijayawada Collectorate
X

Chandrababu Naidu: విజయవాడ కలెక్టరేట్‌లో గణనాథుడికి చంద్రబాబు పూజలు

Chandrababu Naidu: విజయవాడ కలక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదలు రావడంతో కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. వరదల నుంచి విజయవాడ పూర్తిగా కోలుకున్న తర్వాతే అక్కడ నుంచి వెళ్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు పండగ రోజు సైతం విజయవాడలోనే చంద్రబాబు గడిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడికి అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు.

అంతకుముందు తెలుగు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలను ట్విటర్ ద్వారా తెలిపారు చంద్రబాబు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాడవాడలా వినాయక మండపాలతో కళకళలాడాల్సి ఉండేదని... కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేశాయని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ గణపయ్యను కోరుకుంటున్నట్టు వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story