ఆ నియామకం చేసింది అప్పటి గవర్నర్ నరసింహన్: చంద్రబాబు నాయుడు

ఆ నియామకం చేసింది అప్పటి గవర్నర్ నరసింహన్: చంద్రబాబు నాయుడు
x
chandrababu, jagan (File Photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఈరోజు ఉదయాన్నే ఎస్ఈసి కరోనా కారణాన్ని చూపిస్తూ ఎన్నికలను వాయిదా వేశారు. వెంటనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ...

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఈరోజు ఉదయాన్నే ఎస్ఈసి కరోనా కారణాన్ని చూపిస్తూ ఎన్నికలను వాయిదా వేశారు. వెంటనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసి.. గవర్నర్ ను కల్సి ఎస్ఈసీ పై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అప్పట్లో తను అధికారంలో ఉండగా నియమించారని చెప్పారు. అందుకే చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్నికల్ వాయిదా నిర్ణయాన్ని రమేష్ కుమార్ తీసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు.

ఇప్పుడు ఈ విషయం పై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. అసలు రమేష్ కుమార్ నియామకం జరిగింది తన హయాంలోనే అయినా.. ఆయన్ని నియమించింది అప్పటి గవర్నర్ నరసింహన్ అని తేల్చి చెప్పారు. నిజానికి అప్పట్లో తాను సీఆర్‌ బిశ్వను ఎస్‌ఈసీగా ప్రతిపాదిన్చాననీ, ఆ ప్రతిపాదన్ తోసిపుచ్చి అప్పటి గవర్నర్ రమేష్ కుమార్ ను నియమించారానీ చెప్పారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయడు పలు వ్యాఖ్యలు ఈ విషయంపై చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యం అయిపోయాయన్నారు. అందుకే అయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు. కరోనా వ్యాధిపై దేశమంతా అలెర్ట్ అయ్యిందనీ.. ఈ నేపధ్యంలో కరోనా వ్యాప్తి చెందితే మన దేశంలో ఆస్పత్రులు కూడా సరిపోవని.. గ్రామాలన్నీ క్వారంటైన్లుగా మారిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎన్నికల సంఘం ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుని ఉండవచ్చనీ, అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనీ చెప్పారు. రాష్ట్రంలో పులివెందుల తరహా రాజకీయాలను చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటువంటి వాటిని తాను సహించబోననీ హెచ్చరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories