గవర్నర్ కు 14 పేజీల లేఖ సమర్పించిన చంద్రబాబు

K V D Varma
Updated on: 18 Jun 2020 9:57 PM IST
గవర్నర్ కు 14 పేజీల లేఖ సమర్పించిన చంద్రబాబు
X
Chandrababu met governor Biswabhushan today

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఈరోజు సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పై, రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాడులతో కూడిన 14 పేజీల లేఖను గవర్నర్ కు సమర్పించారు.

ఏడాదిగా జరుగుతున్న ఘటనలపై గవర్నర్ కు చంద్రబాబు వివరించారు. తమకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కు వివరించారు. కేవలం 4 రోజుల వ్యవధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సంవత్సరకాలంలో 800 మంది టీడీపీ కార్యకర్తలు దాడులకు గురయ్యారని, వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.

K V D Varma

K V D Varma

Next Story