Chandrababu Naidu: ఢిల్లీలో ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశం

Chandrababu Naidu: రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Aug 2024 8:49 PM IST
Chandrababu met Prime Minister Modi in Delhi
X

Chandrababu Naidu: ఢిల్లీలో ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశం

Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు .. ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. దాదాపు గంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయా నిధుల మంజూరుపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ నిధుల విడుదలపైనా చంద్రబాబు.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో చేసిన రుణాలను రీ షెడ్యూల్ చేయాలని మోడీని కోరారు చంద్రబాబు. మోడీ భేటీ అనంతరం.. హోం మంత్రి అమిత్‌షాను చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story