Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 July 2024 2:01 PM IST
Chandrababu Meets Nirmala Sitharaman
X

Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలిశారు. కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత నిధుల కేటాయింపు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూత ఇవ్వాలన్నారు. బాబుతో పాటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story