Chandrababu: టీడీపీ ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు

Chandrababu: ఉండవల్లిలోని నివాసంలో ఎంపీలతో భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2024 5:58 PM IST
Chandrababu Meeting With TDP MP Candidates
X

Chandrababu: టీడీపీ ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఇవాళ సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అందుబాటులో ఉన్న ఎంపీలతో బాబు భేటీ కాగా... మిగిలిన ఎంపీలు జూమ్ కాల్‌లో అందుబాటులోకి వచ్చారు. సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది. పదవులు శాశ్వతం కాదని ఎంపీలకు బాబు హెచ్చరించినట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story