AP Assembly: అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..

AP Assembly: లా అండ్ ఆర్డర్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 July 2024 5:29 PM IST
AP Assembly: అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..
X

AP Assembly: అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..

AP Assembly: లా అండ్ ఆర్డర్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో జగన్ చర్యల వల్ల.. ఎప్పుడు సినిమాలో హీరోగా కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ కూడా.. రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చిందన్నారు. అదే సినిమాలో అయితే.. పైకి ఎగిరి కొట్టేవారని చంద్రబాబు అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. డిప్యూటీ సీఎం పవన్ కూడా చిరునవ్వు నవ్వారు.

కాగా మహిళల మనోభావాలు దెబ్బతినేలా.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దని కూటమి సభ్యులకు కూడా కోరుతున్నా అన్నారు. సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించేది లేదన్నారు. రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేసేందుకు అవసరం అయితే.. సపరేట్‌ వింగ్ కూడా పెడతానన్నారు చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story