Ponnuru: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు: ఎమ్మెల్యే కిలారి

S. Srikanth
Published on: 16 March 2020 4:37 PM IST
Ponnuru: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు: ఎమ్మెల్యే కిలారి
X
MLA Kilari Venkata Rosaiah

పొన్నూరు: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ తన సొంత సామాజిక వర్గం అడ్డుపెట్టుకొని ఎన్నికలను వాయిదా వేయించిన ఘనత చంద్రబాబు దని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త వైరస్ ను పారదోలుతామని పొన్నూరు పట్టణం వైసీపీ కార్యా లయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కిలారి తెలిపారు.

రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకొని అభివృద్ధి అడ్డుపడుతున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ తీరు మారలేదన్నారు. సొంత సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలను వాయిదా వేయించటం, రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడమే ఈ పచ్చ వైరస్ ను రాష్ట్రం నుంచి పారదోలే వరకువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కిలారి హెచ్చరించారు.

S. Srikanth

S. Srikanth

Next Story