కేశినేని బ్రదర్స్‌ వివాదానికి తెర దించిన టీడీపీ హైకమాండ్‌

TDP: విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

Jyothi
Published on: 5 Jan 2024 9:03 AM IST
Chandrababu Gave Clarity on Vijayawada MP Seat
X

కేశినేని బ్రదర్స్‌ వివాదానికి తెర దించిన టీడీపీ హైకమాండ్‌

TDP: కేశినేని బ్రదర్స్‌ వివాదానికి టీడీపీ హైకమాండ్‌ తెర దించింది. విజయవాడ ఎంపీ సీటుపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కేశినేని నానికి ఎంపీ టికెట్ లేదని అధిష్టానం స్పష్టత నిచ్చింది. చంద్రబాబు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించడంతో పాటు.. ఇకపై తనను పార్టీ వ్యవహారాల్లో కలుగచేసుకోవద్దని.. చంద్రబాబు సూచించినట్టు ఫేస్‌బుక్‌లో కేశినేని నాని పోస్టు చేశారు. అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తానన్న కేశినేని నాని.. ఈ సారి లోక్‌సభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇస్తున్నట్టు కూడా పార్టీ చెప్పిందని పోస్టులో తెలిపారు.

Jyothi

Jyothi

Next Story