సెంట్‌ భూమి ఇచ్చి మురికివాడలు నిర్మిస్తారా : బాబు

సెంట్‌ భూమి ఇచ్చి మురికివాడలు నిర్మిస్తారా : బాబు
x
Highlights

సీఎం జగన్‌ తీరుపై ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎవరో కడుపు మండి కోర్టుకు వెళ్తే.. తమపై విమర్శలు చేస్తారా అని చంద్రబాబు...

సీఎం జగన్‌ తీరుపై ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎవరో కడుపు మండి కోర్టుకు వెళ్తే.. తమపై విమర్శలు చేస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో ఇప్పుడు ఒక కేటగిరీ ఫ్రీ అంటున్నారని ఎద్దెవా చేశారు. సెంట్‌ భూమి ఇచ్చి మురికి వాడలు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ఏపీని పేకాట క్లబ్బులుగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కీమ్‌లు ఉంటాయని.. బాబు స్కీమ్‌, జగన్‌ స్కీమ్‌లు ఉండవన్నారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేని ముఖ్యమంత్రి ఈయన అంటూ జగన్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు విమర్శలు చేయగా.. ఆధారాలతో తాను మాట్లాడతానని ఆయన బదులిచ్చారు. దీనికే ఉలిక్కి పడుతున్నారని.. చెప్పాలంటే ఇంకా చాలా ఉందన్నారు. పేర్లు చాలా పెట్టుకుంటున్నారని.. స్టిక్కర్‌ సీఎంగా మిగిలిపోతారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము కట్టిన ఇళ్లకి మీ స్టిక్కర్‌ వేసుకోవడమేంటని ప్రశ్నించారు. రూపాయికే ఇళ్లు ఇస్తామనేది తప్పుడు ప్రచారమని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories