YS Jagan: తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం

YS Jagan Mohan Reddy: ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్న మాజీ సీఎం జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Sept 2024 8:55 PM IST
YS Jagan Mohan Reddy
X

YS Jagan: తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం

YS Jagan: తిరుపతి లడ్డూ వివాదం.. ఏపీలో రాజకీయంగా మరింతగా ముదురుతోంది. ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది వైసీపీ. చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపారని పేర్కొంటూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది వైసీపీ. అందులో భాగంగా వైసీపీ అధ్యక్షులు జగన్‌ ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు.

అక్కడ స్వామివారికి పూజలు చేయనున్నారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని.. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్‌ వేదికగా జగన్‌ నిలదీశారు. ఆరోజు వైఎస్సార్‌సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు జగన్‌.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story