సాంకేతిక లోపంతో ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్‌

సాంకేతిక లోపంతో ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్‌
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ నడిరోడ్డుపై ఆగిపోయింది. దీంతో చంద్రబాబు 20 నిమిషాలు రోడ్డుపైనే ఉండిపోయారు. సాంకేతిక లోపం కారణంగా చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ నార్కట్‌పల్లి వద్ద ఆగిపోయింది.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ నడిరోడ్డుపై ఆగిపోయింది. దీంతో చంద్రబాబు 20 నిమిషాలు రోడ్డుపైనే ఉండిపోయారు. సాంకేతిక లోపం కారణంగా చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ నార్కట్‌పల్లి వద్ద ఆగిపోయింది. అది ఎంతకు రిపేర్ కాకపోవడంతో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లారు. అమరావతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్లచ్‌ ప్లేట్లలో లోపం తలెత్తినట్లు గుర్తించిన డ్రైవర్‌ కాన్వాయ్‌ ను వెంటనే నిలిపివేశారు. దీంతో మరో వాహనంలో చంద్రబాబు హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories